సమస్యలు చెబితే ఎదురుదాడి ఎందుకు?:పెద్దిరెడ్డి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలు.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని భాజపా నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆరోపించారు. భాజపా కార్యాలయంలో మాజీ మంత్రి

Published : 29 Apr 2020 00:33 IST

హైదరాబాద్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలు.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని భాజపా నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆరోపించారు. భాజపా కార్యాలయంలో మాజీ మంత్రి విజయ రామారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం.. దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. భాజపా నేతలు రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయరామారావు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ కృషి అభినందనీయమని కేసీఆర్‌ కీర్తిస్తుంటే మంత్రి కేటీఆర్‌, సహచర మంత్రులు తెరాస వల్లనే ఇదంతా సాధ్యమైందటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సొమ్ము దిల్లీది.. సోకు రాష్ట్ర ప్రభుత్వానిదిలా ఉందని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని