‘‘మూడు రాజధానులతో వచ్చే ఇబ్బందేంటి’’

మండలి నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్న తమ్మినేని

Updated : 20 Jun 2020 16:15 IST

ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం

అమరావతి: రాష్ట్రాల విషయంలో శాసనసభ నిర్ణయాలే అంతిమమని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మండలి నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్న తమ్మినేని... పెద్దల సభలో ద్రవ్య వినిమయ బిల్లును సైతం అడ్డుకున్నారని విమర్శించారు. విశాఖపట్నం కచ్చితంగా రాజధాని అవుతుందని చెప్పారు. మూడు రాజధానులతో వచ్చే ఇబ్బంది ఏంటని తమ్మినేని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతిపక్షానికి ఇష్టం లేదా అని సభాపతి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని