దేశ ఆర్థిక పురోగతి పీవీ ఘనతే: ఉత్తమ్‌

సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు...

Published : 29 Jun 2020 01:46 IST

హైదరాబాద్‌: సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి ఎంతో మంది పేదలకు మేలు చేకూర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆదివారం పీవీ శత జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. 

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పీవీ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆర్థికంగా దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన ఘనత పీవీదేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. అంతటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వేడుకలు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏడాది పాటు వేడుకలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీవీని ఆదర్శంగా తీసుకుని రాజనీతి నేర్చుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని