‘వైఎస్‌ఆర్‌ పదాన్ని వాడకుండా చూడండి’

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అని వాడుతున్నారని ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు.

Updated : 01 Jul 2020 19:14 IST

ఎన్నికల  సంఘాన్ని కోరిన మహబూబ్‌ బాషా

దిల్లీ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అని వాడుతున్నారని ఎన్నికల సంఘానికి అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్ అనే పదాన్ని ఇతర పార్టీ పేర్లలో వాడకుండా చూడాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. వైఎస్సార్ అనే పదంతో రిజిస్ట్రీ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  బాషా తెలిపారు.

‘‘వైకాపా వారి అధికార పత్రాలపై పూర్తి పేరు వాడకుండా వైఎస్‌ఆర్ అని రాయడంపై ఎన్నికల సంఘం ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశాం. ఇటీవల ఓ ఎంపీకి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో వైఎస్‌ఆర్‌ అని రాయడంతో అది మా పార్టీది అని కొందరు అనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ అనే పదం ఇతర పార్టీలు వాడకూడదని ఎస్ఈసీ గతంలోనే చెప్పింది’’ అని మహబూబ్‌ బాషా తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని