సెంట్రల్‌ విస్టా కంటే.. మౌలిక వసతులపై దృష్టి సారించాలి

కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్‌ విస్టా మీద కాకుండా.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందని భారాస తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated : 27 Jan 2023 05:53 IST

ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్‌ విస్టా మీద కాకుండా.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందని భారాస తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ  యువతను పట్టించుకోవడం కోసమే భారాస పోరాడుతోందన్నారు. ‘కేసీఆర్‌ రోజూ ప్రశ్నిస్తున్న వాటినే గణతంత్ర దినోత్సవం వంటి  ప్రత్యేక రోజున గవర్నర్‌ తమిళిసై తన ప్రసంగంలో మళ్లీ అడిగినందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

గవర్నర్‌ విమర్శలు దారుణం: కార్పొరేషన్ల ఛైర్మన్లు

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్‌ మాట్లాడారని రాష్ట్ర వైద్యఆరోగ్యమౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, రెడ్‌కో, చలనచిత్ర అభివృద్ధి సంస్థ, టీఎస్‌ ఫుడ్స్‌  ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సతీశ్‌రెడ్డి, అనిల్‌ కూర్మాచలం, రాజీవ్‌ సాగర్‌ విమర్శించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్రం ప్రశంసిస్తుంటే.. గవర్నర్‌ మాత్రం విమర్శలు చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా రాజ్యాంగబద్ధ హోదాలో తన గౌరవాన్ని కాపాడుకోవాలి’’ అని వారు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని