అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ

ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీతో కాంగ్రెస్‌ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు లాబీలో ఆయనతో సమావేశమయ్యారు.

Published : 07 Feb 2023 03:56 IST

అసెంబ్లీ లాబీలో సమావేశం
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీతో కాంగ్రెస్‌ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు లాబీలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..‘భాజపాకు ఎంఐఎం బీటీమ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో భాజపా అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆ పార్టీ పూర్తిగాఓటు బ్యాంకును పోలరైజ్‌ చేస్తోంది. మేము మా వర్గానికి అండగా ఉంటాం’అని అక్బరుద్దీన్‌ కాంగ్రెస్‌ నేతలతో అన్నట్లు తెలిసింది. ‘మీరు మీ వర్గానికి అండగా ఉంటూ ఆ ఓట్లు చీల్చాలనేదే భాజపా ఎజెండా కదా’! అని శ్రీధర్‌బాబు అభిప్రాయపడగా, ‘ఎవరు ఏమనుకున్నా..వచ్చే ఎన్నికల్లో మేము తెలంగాణలో పార్టీని మరింత విస్తరిస్తాం’అని అక్బరుద్దీన్‌ అన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని