ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఉపాధ్యాయులకు తాయిలాలు

శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్ల కోసం తాయిలాలు మొదలయ్యాయి. అధికార పార్టీ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున సోమవారం అనంతపురం జిల్లాలో బెళుగుప్ప, విడపనకల్లు, గుంతకల్లు, కంబదూరు మండలాల్లోని పాఠశాలలకు టిఫిన్‌ బాక్సులు పంపిణీ చేశారు.

Updated : 07 Feb 2023 11:00 IST

అధికార పార్టీ తరఫున టిఫిన్‌ బాక్సుల పంపిణీ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్ల కోసం తాయిలాలు మొదలయ్యాయి. అధికార పార్టీ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థి తరఫున సోమవారం అనంతపురం జిల్లాలో బెళుగుప్ప, విడపనకల్లు, గుంతకల్లు, కంబదూరు మండలాల్లోని పాఠశాలలకు టిఫిన్‌ బాక్సులు పంపిణీ చేశారు. అభ్యర్థి తరఫున కొందరు వ్యక్తులు బడులు తెరవకముందే వచ్చి అక్కడి స్వీపర్లకు బ్యాగులు అందజేశారు. ఉపాధ్యాయులందరికీ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. కరపత్రాలూ అందించారు. కొన్నిచోట్ల హెచ్‌ఎంలు వాటిని ఉపాధ్యాయులకు పంపిణీ చేయగా, మరికొన్నిచోట్ల తిరస్కరించారు. పట్టభద్రుల ఓట్ల కోసం అధికార పార్టీ తరఫున ప్రైవేటు ఉపాధ్యాయులకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని