అప్పురత్న హయాంలో అభివృద్ధి మరచిపోవడమే: మనోహర్‌

అప్పులపై రోజుకు రూ.65కోట్ల వడ్డీ కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్‌ కావచ్చని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు.

Updated : 08 Feb 2023 06:23 IST

ఈనాడు, అమరావతి: అప్పులపై రోజుకు రూ.65కోట్ల వడ్డీ కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్‌ కావచ్చని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. అప్పురత్నగా మారిన జగన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి అనే మాటను మరచిపోవచ్చని విమర్శించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం సగటున రోజుకు రూ.205 కోట్ల అప్పు తెస్తున్న మాట వాస్తవం. బహిరంగ మార్కెట్‌ రుణాలు, కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ హామీతో తెచ్చేవి కలిపితే ఇది రూ.500 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. రోజూ వందలకోట్ల అప్పులు చేస్తున్నా, ప్రభుత్వోద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతం అందుకోలేకపోతున్నారు’ అని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘ఏ పని చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు వేయట్లేదు, రోడ్ల పనులు చేయట్లేదు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వరు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు కాదు, అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాలూ అమలు కావట్లేదు’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని