ప్రత్యేక హోదా ప్రస్తావన ఏనాడైనా చేశారా?

ప్రత్యేక హోదా కోసం పోరాడతామని తమ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అనడం హాస్యాస్పదంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 09 Feb 2023 04:32 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ప్రత్యేక హోదా కోసం పోరాడతామని తమ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అనడం హాస్యాస్పదంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకొని తన కేసులు మాఫీ చేయించుకునే ప్రయత్నాలు చేశారే తప్ప ఏనాడైనా ప్రత్యేక హోదా ప్రస్తావన చేశారా? ప్రజలను మభ్య పెట్టేందుకే మళ్లీ పోరాటం అంటున్నారు. న్యాయస్థానాలు పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. 32 కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలకు న్యాయమూర్తులు తమ విచక్షణాధికారాలతోనే బెయిలు ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలి. రాజధాని ఏర్పాటు చేసుకునే అధికారం శాసనసభలకు ఉండేలా చట్ట సవరణ చేయలని గతంలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పడం విడ్డూరం... ’ అని రఘురామ పేర్కొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించేందుకు నియమ నిబంధనలు సడలించినట్లే వృద్ధులు, వితంతువులకు పింఛన్ల మంజూరులోనూ సడలింపులు ఇవ్వాలని రఘురామ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని