సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
సమస్యల్ని ప్రస్తావించిన గ్రామస్థులపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం సాయంత్రం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: సమస్యల్ని ప్రస్తావించిన గ్రామస్థులపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం సాయంత్రం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మా కాలనీలో ప్రతినెలా రేషన్ ఇవ్వడం లేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. ఏళ్ల తరబడి మా ఆధీనంలో ఉన్న పశువుల పాకను నాయకులు ఆక్రమించుకున్నారు..’ అంటూ ఎమ్మెల్యే ఎదుట గ్రామస్థులు ఆందోళన వెలిబుచ్చారు. నాలుగేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన రామచంద్రారెడ్డి సమస్యల్ని అడిగితే చెప్పుతో కొడతా అంటూ దూషించారు. పక్కనే ఉన్న పోలీసు కల్పించుకుని కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వైకాపా నాయకులు సర్దిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ
-
Chandrababu Arrest: మహిళా శక్తి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత
-
Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్
-
Atlee: హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది.. స్పానిష్ ఫిల్మ్ తీయొచ్చేమో: ‘జవాన్’ డైరెక్టర్