‘జమిలి’ అంటే అంత ఉలికిపాటెందుకు..!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మండిపడ్డారు.

Published : 18 Sep 2023 04:37 IST

విపక్షాలపై మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ధ్వజం

శిమ్లా: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మండిపడ్డారు. జమిలి ఉంటే ఉలికిపాటెందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అనురాగ్‌ ఠాకుర్‌ పాల్గొన్నారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’తో దేశం సమయం, డబ్బును ఆదా చేయాలని ఇండియా కూటమి కోరుకోవడంలేదు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. విపక్ష కూటమి నేతలు నాలుగుసార్లు సమావేశమైనప్పటికీ ఒక నేతను గానీ, కన్వీనర్‌ను గానీ నియమించలేకపోయారు’’ అంటూ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని