Barrelakka Sirisha: కొల్లాపూర్‌లో నామినేషన్‌ వేసిన బర్రెలక్క

తనపై కేసు పెట్టడంతో నిరసనగా నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పేర్కొన్నారు.

Updated : 09 Nov 2023 07:27 IST

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే: తనపై కేసు పెట్టడంతో నిరసనగా నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష బుధవారం కొల్లాపూర్‌లో రిటర్నింగ్‌ అధికారి కుమార్‌దీపక్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి యూట్యూబ్‌, సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారి తీరుపై నిరసనగా నిరుద్యోగుల వాణి వినిపించడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని