Amit Shah: కోటి దాటిన అమిత్‌షా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అనుసరించే వారి సంఖ్య కోటి మార్కును దాటింది.

Updated : 30 Dec 2023 05:31 IST

దిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అనుసరించే వారి సంఖ్య కోటి మార్కును దాటింది. మైలురాళ్లుగా పేర్కొనదగ్గ బిల్లులతో పాటు మూడు క్రిమినల్‌ కోడ్‌ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఇది సాధ్యమైందని భాజపా వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కీలక వ్యూహకర్త అయిన అమిత్‌షాకు ఎక్స్‌లో 3.4 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.07 కోట్లు, ఫేస్‌బుక్‌లో 1.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత రాజకీయ నాయకుల్లో అత్యధికంగా అనుసరించేది ఆయన్నే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని