Congress: కీలక శాఖలన్నీ దగ్గర పెట్టుకొని దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్‌: మంత్రి కోమటిరెడ్డి

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Updated : 05 Feb 2024 19:54 IST

నల్గొండ: తాగేందుకు నీళ్లు లేక సూర్యాపేటలో ప్రజలు మూసీ నీళ్లు తాగుతుంటే.. అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలో భారాస రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క సీటు మాత్రమే గెలిచిందన్న ఆయన... తాము సూర్యాపేటలో ప్రచారం చేసి ఉంటే 70 వేల ఓట్లతో జగదీశ్‌ రెడ్డి ఓడిపోయేవారన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

‘‘ఎస్‌ఎల్‌బీసీపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే ఉంటాయి. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకొని భారాస అధినేత కేసీఆర్‌ దోపిడీకి పాల్పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ బాలకృష్ణనే ఆయన దోపిడీకి ఉదాహరణ. అతడు రూ.వందల కోట్ల అక్రమ సంపాదనతో దొరికాడు. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కి ఐదు వేల ఎకరాలున్నాయి. ఆయన బండారం త్వరలో బయటపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు భారాస అధినేత అడ్డంగా దోచుకొని ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారు. ఆయన ఇంకా ప్రైవేటు విమానం లీజ్‌ క్యాన్సిల్‌ చేసుకోలేదు. దుబాయ్‌ పారిపోవచ్చనే లీజును కొనసాగిస్తున్నారేమో. అన్ని విషయాలు అసెంబ్లీలో బయటపడతాయి’’ అని కోమటిరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని