మోదీ పాలనలో దేశం సురక్షితం: నడ్డా

ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని, అభివృద్ధి కేంద్రంగా కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు.

Published : 03 Jul 2022 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని, అభివృద్ధి కేంద్రంగా కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 20 ఏళ్లకు పైగా సేవలందించారని అన్నారు. ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌’ నినాదంతో ప్రజా సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని ప్రశంసించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపింది మోదీనే అన్నారు. దేశంలో అత్యున్నమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును ప్రకటించారని గుర్తించాలన్నారు. యూపీలో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది భాజపా ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.  మోదీ నేతృత్వంలో జాతి, కుటుంబ, అవినీతి రాజకీయాలు అంతమయ్యాయని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతి మొదలైందన్నారు. మోదీ పాలనలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించారని నడ్డా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని