గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాను

గిరిజనులకు అటవీభూములు, ఇతర వనరులపై ఉన్న హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనకు సన్నిహితులైన పెట్టుబడిదారులకు లబ్ధి

Published : 10 Aug 2022 05:41 IST

గిరిజనులకు అటవీభూములు, ఇతర వనరులపై ఉన్న హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనకు సన్నిహితులైన పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడానికి కొత్త నియమ నిబంధనల పేరుతో వారి హక్కులను లాక్కోవడానికి కుట్ర పన్నుతోంది. వారికి న్యాయం జరగడానికి నా చివరి శ్వాస వరకూ పోరాడుతాను.

- రాహుల్‌ గాంధీ


గాలిలో దీపంలా నియామక ప్రక్రియ

దేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియ గాలిలో దీపంలా మారింది. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. యువత తమ జీవితంలో అత్యంత కీలకమైన సమయాన్ని నిరసనలు, కోర్టు కేసులతో కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టకపోతే యువతతోపాటు దేశ భవిష్యత్తు కూడా అంధకారంలోకి పోతుంది.

- వరుణ్‌ గాంధీ


పెరుగుట విరుగుట కొరకే..

మోదీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కారును కూల్చివేసే ప్రయత్నాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే 2020 మార్చిలో లాక్‌డౌన్‌ను వాయిదా వేసింది. ఇప్పుడు బిహార్‌లో తమ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతోందని తెలిసే పార్లమెంటు సమావేశాలను షెడ్యూల్‌ కన్నా ముందే ముగించింది. పెరుగుట విరుగుట కొరకే.

- జైరాం రమేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని