Andhra News: గోరంట్ల మాధవ్‌కు 500 కార్లతో స్వాగతం పలకడమేంటి?: ఎంపీ రఘురామ

రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి చిత్రహింసలు పెట్టి ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం నగ్న వీడియో వివాదంలో

Updated : 13 Aug 2022 09:52 IST

ఈనాడు, దిల్లీ: రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి చిత్రహింసలు పెట్టి ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌కు 500 కార్లతో భారీ స్వాగతం పలకడం ఏమిటని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం తమ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతుంటారని, ఈ రకమైన ప్రోత్సాహంతో నిజంగానే దేశమంతా తమ వైపు చూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఇప్పటికే చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తి పన్ను పేరిట భారాన్ని మోపిన జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఇంపాక్ట్‌ పన్ను భారంతో ఎన్నికలకు వెళ్లితే జనం తమను ఉతికి ఆరేస్తారని పేర్కొన్నారు. విజయమ్మ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని కోరారు. ఒకే సమయంలో రెండు టైర్లు బద్దలవ్వడం వెనుక కుట్ర ఏమైనా ఉందేమో తేల్చాలని రఘురామ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని