Nara Lokesh: వచ్చే వారంలో జగన్‌ కుంభకోణం బయటపెడతా!: నారా లోకేశ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చే వారంలో బయటపెడతానని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే

Updated : 17 Aug 2022 08:37 IST

మంగళగిరి(తాడేపల్లి), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణం వచ్చే వారంలో బయటపెడతానని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జగన్‌మోహన్‌ రెడ్డివి పదో తరగతి పాస్‌, డిగ్రీ ఫెయిల్‌ తెలివి తేటలు. ఆయనకు అవగాహన తక్కువ. ఇంటికెళ్లే పరిస్థితి వచ్చేసింది. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంత? అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి పరిశ్రమలు ఏవిధంగా తీసుకురావాలి? దానివెనుక ఎంత కష్టం ఉంటుందో తెలియని వ్యక్తి జగన్‌. మూడేళ్ల నాలుగు నెలల్లో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలేంటో శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధం. కియా, వాక్స్‌కాన్‌, హెచ్‌సీఎల్‌, అదానీ డేటా సెంటర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అపోలో టైర్‌ తీసుకొచ్చింది చంద్రబాబే. జగన్‌ వెళ్లి రిబ్బన్‌ కట్‌ చేస్తున్న ప్రతి పరిశ్రమ తెదేపా కృషే. మేం తెచ్చిన పరిశ్రమలను ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు. దాదాపు 500 హామీల్లో మాటతప్పి మడమ తిప్పిన జగన్‌మోహన్‌ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో గెలిపించాలా? ఈడీ, ఐటీ, సీబీఐల భయంతో దిల్లీలో తన మెడ వంచుతున్న జగన్‌.. రాష్ట్రానికి ఏమి సాధించారు’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని