రేపటి విపక్షాల భేటీకి తృణమూల్‌ దూరం

పార్లమెంటు శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న విపక్షాల భేటీకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు హాజరుకావడం లేదు. సభల్లో అనుసరించాల్సిన

Updated : 28 Nov 2021 05:50 IST

కోల్‌కతా: పార్లమెంటు శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న విపక్షాల భేటీకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు హాజరుకావడం లేదు. సభల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి వెళ్లే అవకాశాలు లేవని తృణమూల్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తొలుత ఇంటిని చక్కదిద్దుకోవాలని, అప్పుడే ఇతర పార్టీలతో సమన్వయం గురించి ఆలోచించవచ్చని అన్నారు. భాజపాను ఎదుర్కోవాలన్న పట్టుదల ఆ పార్టీ నాయకుల్లో లేదని విమర్శించారు. అలాంటప్పుడు ప్రతిపక్షాలను సమన్వయం చేసే బాధ్యతను తృణమూల్‌ తీసుకుంటుందా? అని ప్రశ్నించగా.. ఇతరుల సహకారంతో పలు అంశాలను ప్రస్తావిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని