8న చలో దిల్లీ: ఆర్‌.కృష్ణయ్య

చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం, బీసీ కుల గణన చేయాలనే డిమాండ్లతో డిసెంబరు 8న చలో దిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీ

Updated : 29 Nov 2021 05:02 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం, బీసీ కుల గణన చేయాలనే డిమాండ్లతో డిసెంబరు 8న చలో దిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. వేల మంది బీసీలతో పార్లమెంటు వద్ద ప్రదర్శన చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబరు 9, 10 తేదీల్లో కేంద్ర మంత్రుల నివాసాలను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. బీసీల ఉద్యమానికి నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మద్దతు ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ బీసీ సంఘాల నేతలు వెంగళరావు, నూకాలమ్మ, తెలంగాణ నేతలు నీల వెంకటేష్‌, జి.కృష్ణ, పగిళ్ల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని