24న డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరిక!

పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 24న దిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రెండేళ్ల నుంచి తెరాస పార్టీ వ్యవహారాలకు

Published : 17 Jan 2022 04:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 24న దిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రెండేళ్ల నుంచి తెరాస పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న డీఎస్‌ ఇటీవల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. 2015 జులైలో బంగారు తెలంగాణ లక్ష్యంగా తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన డీఎస్‌ 2016 జూన్‌లో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 21న ముగియనుంది. డీఎస్‌ రెండో తనయుడు అర్వింద్‌ నిజామాబాద్‌ ఎంపీగా భాజపా తరఫున ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని