గోవాలో భాజపాకు మరో షాక్‌..

గోవాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గోవా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ భాజపాకు గుడ్‌బై చెప్పనున్నారు.

Updated : 23 Jan 2022 05:35 IST

పార్టీని వీడనున్న మాజీ సీఎం పర్సేకర్‌

పణజీ: గోవాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గోవా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ భాజపాకు గుడ్‌బై చెప్పనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్‌ ఇవ్వలేదని, త్వరలో తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు పర్సేకర్‌ తెలిపారు. భాజపాలో కొనసాగాలని లేదని.. ఇప్పటికైతే తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు శనివారం పర్సేకర్‌ పేర్కొన్నారు. పర్సేకర్‌ 2002 నుంచి 2017 వరకు ప్రాతినిథ్యం వహించిన మండ్రేమ్‌ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్‌ సోప్టేను భాజపా బరిలోకి దింపనుంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సోప్టే.. పర్సేకర్‌పై గెలుపొందారు. అనంతరం 2019లో ఆయన భాజపాలో చేరారు. పర్సేకర్‌ 2014-17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం గోవా ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఫిరాయింపుల్లో.. గోవా ఎమ్మెల్యేల జోరే జోరు

పణజీ: ఫిరాయింపుల్లో గోవా జాతీయ రికార్డు నెలకొల్పింది. గత ఐదేళ్లలో  రాష్ట్రానికి చెందిన 60 శాతం ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ వచ్చారు. ఈ స్థాయిలో శాసనసభ్యులు ఫిరాయింపులకు పాల్పడడం దేశంలో ఇదే తొలిసారని అసోషియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. గోవాలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 40. ఇందులో 60 శాతం ఎమ్మెల్యేలంటే 24. వీరు.. 2017-22 మధ్య కాలంలో వివిధ పార్టీల కండువాలు కప్పుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని