Varalaxmi Sarathkumar: పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఫన్నీ వీడియో

పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ వీడియో క్రియేట్‌ చేశారు. దాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Published : 08 May 2024 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే సినీ సెలబ్రిటీల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ఒకరు. తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అందులో.. ‘పెళ్లి చేసుకో.. లైఫ్‌ చాలా బాగుంటుంది’ అని ఆమె సలహా ఇవ్వగా మరో వ్యక్తి ‘ఎవరి లైఫ్‌?’ అని అడుగుతూ కనిపిస్తాడు. ఫొటోగ్రాఫర్స్‌, క్యాటరింగ్‌ వాళ్లు అంటూ ఆమె సమాధానమిస్తారు. ఆర్తి అనే అమ్మాయి తమిళ్‌లో చేసిన వీడియోను స్ఫూర్తిగా తీసుకుని తాను అనుకరించినట్టు తెలిపారు. ‘మీరు చెప్పింది నిజమే’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. నవ్వుల ఎమోజీలు జోడిస్తున్నారు.

ఇటీవల.. ‘శబరి’ (Sabari) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరలక్ష్మి త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త సచ్‌దేవ్‌తో ఆమెకు నిశ్చితార్థం అయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు