Indian Railways: రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం

గత పదేళ్ల కాలంలో దేశంలో రోజుకు సరాసరి 7.41 కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగిందని భారతీయ రైల్వే (Indian Railways) ఇచ్చిన సమాచారంలో వెల్లడైంది.

Published : 08 May 2024 20:49 IST

దిల్లీ: గత పదేళ్లలో దేశంలో 27 వేల కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగిందని భారతీయ రైల్వే (Indian Railways) వెల్లడించింది. రోజుకు సరాసరి 7.41 కి.మీ. వేసినట్లు పేర్కొంది. వీటిలో కొత్త లైన్ల నిర్మాణంతో పాటు ఇదివరకే ఉన్న ట్రాకులకు డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ పనులు ఉన్నాయని తెలిపింది. వీటితోపాటు మీటర్‌ గేజ్‌ నుంచి బ్రాడ్‌ గేజ్‌ పనులు కూడా పూర్తి చేసినట్లు వివరించింది.

దేశంలో రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేశారు. దీనిపై భారతీయ రైల్వే సమాచారం ఇచ్చింది. 2014-15 నుంచి 2023-24 వరకు పదేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తంగా 27,057 కి.మీ. మేర రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టినట్లు అందులో పేర్కొంది.

‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి

ఈ ఏడాది ఫిబ్రవరి 2నలో రైల్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. గతేడాది కొత్తగా 5200 కి.మీ. మేర కొత్త ట్రాకుల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇది స్విట్జర్లాండ్‌లో ఉన్న మొత్తం రైల్వే నెట్‌వర్క్‌తో సమానమన్నారు. నిత్యం సరాసరి 15 కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరుగుతోందని వివరించారు. అయితే, ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో మాత్రం 2022-23లో మొత్తం 3,901 కి.మీ ట్రాకులు వేసినట్లు పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు