Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 May 2024 20:59 IST

1. విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో.. జనం బ్రహ్మరథం

ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రమైన విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్‌ షోలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో బెజవాడ జనసంద్రంగా మారింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌పై భాజపా వివాదాస్పద పోస్టు.. జేపీ నడ్డాకు సమన్లు

కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు ఇచ్చారు. అలాగే బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సమన్లలో భాగంగా వారు హాజరయ్యేందుకు అధికారులు వారం రోజుల సమయం ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పూంఛ్‌ దాడిలో పాక్‌ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!

జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో వాయుసేనకు చెందిన వాహనశ్రేణిపై దాడి కేసు దర్యాప్తులో ఏజెన్సీలు కీలక ముందడుగు వేశాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్‌ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం గమనార్హం. వీరిని ఇల్లియాస్‌ (పాక్‌ మాజీ కమాండో), అబూ హమ్జా (లష్కరే కమాండో), హడూన్‌గా గుర్తించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి.. భార్యకు టికెట్‌

అశోక్‌ మహతో (Ashok Mahto) మీకు తెలుసా? తెలియడం లేదా.. ‘నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఖాకీ గుర్తుందా.. అయితే మీకు మహతో తెలిసినట్టే. ఒక కరడుగట్టిన నేరగాడి ఆగడాలు.. అతనిని  పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌లోదా వ్యూహాలపై ఓ పుస్తకం కూడా వచ్చింది. దీని ఆధారంగానే ‘ఖాకీ’ వెబ్‌సిరీస్‌ నిర్మించారు. ఇది మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది రియల్‌ మహతో గురించి.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘మన ఇంటికి బాబు’.. టెక్నాలజీ సాయంతో మన ఇంటికే చంద్రబాబు, లోకేష్‌

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తాము అందించబోయే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను వివరిస్తున్న పార్టీ.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. వైకాపాకు కౌంట్‌డౌన్‌ మొదలైంది: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ వికాసమే తన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ.. ఈ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!

జపాన్‌(Japan)లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిని ప్రతీ ఒక్కరికీ ఇచ్చుకొంటూ వెళితే న్యూయార్క్‌లో నగర జనాభాకు సరిపోతాయి. జపాన్‌లో జనాభా తరుగుదల సమస్యకు ఇది అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశంలో ఇలా వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.16 లక్షలు ఉండాల్సిందే!

వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీలో అది సుమారు రూ.16,35,000. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవర్సీస్‌ ఛైర్మన్‌ పదవికి శామ్‌ పిట్రోడా రాజీనామా

ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ శామ్‌పిట్రోడా (Sam Pitroda) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. పసుపుబోర్డు పేరు చెప్పి ఎన్నాళ్లీ మోసం?: సీఎం రేవంత్‌రెడ్డి

పంజాబ్‌, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్‌.. ఆర్మూర్‌ రైతులు అదేబాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో భాజపా, భారాసపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను ఆ తర్వాత కవిత మరిచారని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని