Prashanth Neel: ‘కేజీయఫ్‌ 3’, ‘సలార్‌ 2’పై అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌

‘కేజీయఫ్‌ 3’, ‘సలార్‌ 2’లపై ప్రశాంత్ నీల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు.

Updated : 08 May 2024 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతో జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చుకొని బ్రాండ్‌గా మారారు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel). ‘కేజీయఫ్‌ 2’ దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే ప్రభాస్‌ హీరోగా గతేడాది వచ్చిన ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాల సీక్వెల్స్‌ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా ప్రశాంత్‌నీల్‌ తన అప్‌కమింగ్‌ సినిమాలు రెండిటిపై అప్‌డేట్స్‌ షేర్‌ చేశారు. ‘‘సలార్‌2’ (Salaar 2) శౌర్యంగపర్వం పేరుతో సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈనెల చివర్లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘కేజీయఫ్‌ 3’ (KGF 3) కచ్చితంగా ఉంటుంది. స్క్రిప్ట్‌ వర్క్ కూడా పూర్తయింది. యశ్‌, విజయ్‌ కిరంగదూర్‌ ఇద్దరూ వాళ్ల ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. వాళ్ల షెడ్యూళ్లు పూర్తవగానే కేజీయఫ్‌ మూడో భాగాన్ని ప్రారంభిస్తాం’ అని (Director Prashanth Neel) చెప్పారు. ఈ అప్‌డేట్స్‌ (Movie Updates) సినీ ప్రియుల్లో జోష్‌ నింపాయి.

వి.వి. వినాయక్‌ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్‌

ప్రశాంత్ నీల్ అప్‌కమింగ్‌ లిస్ట్‌లో ఉన్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌ 31’. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా నుంచి పోస్టర్‌ వచ్చి చాలా రోజులవుతోంది. దీని చిత్రీకరణ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట ప్రశాంత్‌నీల్‌. అక్టోబర్‌ నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటికి ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కూడా పూర్తి అవుతుంది కాబట్టి దీన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోపు యశ్‌ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు కూడా కంప్లీట్‌ అయ్యే అవకాశముంది. ఆ తర్వాత ‘కేజీయఫ్ 3’ మొదలుపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని