విగ్రహం పెడితే ప్రేమ ఉన్నట్లేనా?

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రంపై మరోసారి విమర్శలకు దిగారు. ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని కేంద్రం హామీ ఇచ్చినా, గణతంత్ర కవాతులో నేతాజీ శకటానికి చోటు ఇవ్వకుండా

Published : 24 Jan 2022 04:56 IST

నేతాజీ అదృశ్యంపై మిస్టరీ వీడలేదేం: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రంపై మరోసారి విమర్శలకు దిగారు. ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని కేంద్రం హామీ ఇచ్చినా, గణతంత్ర కవాతులో నేతాజీ శకటానికి చోటు ఇవ్వకుండా చేసిన అన్యాయం నుంచి తప్పించుకోలేదని చెప్పారు. ఆదివారం కోల్‌కతాలో ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘విగ్రహం పెడితే నేతాజీపై ప్రేమ ఉన్నట్లేనా? మా శకటానికి ఎందుకు స్థానం నిరాకరించారో కారణాన్ని ఇప్పటివరకు వివరించలేదు. గణతంత్ర దినోత్సవం రోజు కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో గణతంత్ర కవాతులో నేతాజీ శకటాన్ని ప్రదర్శిస్తాం. అది ఎంత దేదీప్యమానంగా, సృజనాత్మకంగా ఉంటుందో చూడండి. అధికార పగ్గాలు చేపట్టాక నేతాజీ అదృశ్యంపై మిస్టరీని ఛేదిస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు విఫలమయింది. మేం మాత్రం నేతాజీకి సంబంధించి అందుబాటులో ఉన్న దస్త్రాలన్నింటినీ డిజిటలీకరించాం’ అని మమత వివరించారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

అమర్‌ జవాన్‌ జ్యోతిని జాతీయ యుద్ధ సార్మక జ్యోతిలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని మమత తప్పుపట్టారు. నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినంత మాత్రాన దీనికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు కాదన్నారు. బోస్‌ జ్ఞాపకార్థం 100% రాష్ట్ర నిధులతో జైహింద్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ట్విటర్లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని