MLC Election: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్‌

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

Updated : 28 Mar 2024 17:14 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 99.86 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఏఆర్వో ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అందులో 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఓటు వేశారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, భారాస నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని