Janasena: విశాఖలో రోడ్డు మూసివేతపై జనసేన ఆందోళన

నగరంలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Published : 11 Dec 2023 11:11 IST

పెదవాల్తేరు: నగరంలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. దీంతో వీఐపీ రోడ్డులో భారీగా పోలీసులను మోహరించి మూర్తియాదవ్‌తో పాటు, జనసేన కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

ఈ మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లి స్థానిక వినాయక ఆలయం నుంచి మలుపు తిరిగి రావాల్సి వస్తోంది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం దృష్ట్యా రోడ్డు మధ్యలో వేసిన సిమెంట్‌ స్టాపర్స్‌ను తొలగించాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. దీంతో నేడు జనసైనికులు, వీర మహిళలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. స్టాపర్స్‌ను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈ ధర్నాలో పాల్గొన్న నిరసనకారులను అరెస్టు చేసి మూడో పట్టణ ఠాణాకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని