న్యాయపోరాటానికి సమయం వచ్చింది: జనసేన

ఏపీ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించట్లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజధానుల విషయంపై పార్టీ నేతలతో జనసేన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. విశాఖ హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంలో మృతి చెందిన  వారికి సంతాపం తెలిపింది. రాజధాని

Published : 03 Aug 2020 01:21 IST

అమరావతి: ఏపీ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి ప్రజామోదం కనిపించట్లేదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజధానుల విషయంపై జనసేన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. విశాఖ హెచ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంలో మృతి చెందిన  వారికి సంతాపం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని జనసేన పేర్కొంది. ప్రజలు ఉద్యమించకుండా కొవిడ్‌ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పింది. వేల ఎకరాలను అమరావతి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని,  ప్రభుత్వం మారగానే రాజధాని మారితే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, తోట చంద్రశేఖర్‌, పీఎసీ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ ‘‘ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇకపై భూసేకరణలు చేపడితే ప్రజలే ఏం నమ్మి భూములు ఇస్తారు? రాజధాని విషయంలో తొలి నుంచి జనసేన ఒకే విధానంతో ఉంది’’అని తెలిపారు.

రాజధాని తరలింపు ప్రభుత్వ నిర్ణయం కాదని.. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ‘‘రాజధానిలో భూ కుంభకోణాలు జరిగాయని వైకాపా చెబుతోంది. కుంభకోణాలు చేసిన వారిని విచారించి శిక్షించాలి కదా? రాజధానిలో పవన్‌ పర్యటించి నిర్మాణాలు పరిశీలించారు. రైతులు నష్టపోకూడదని మొదట్నుంచీ పవన్‌ చెబుతున్నారు’’అని మనోహర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని