154 స్థానాల్లో పోటీకి దిగనున్న కమల్‌ పార్టీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ఇండియా జననాయక కచ్చి, ఆలిండియా సమతువా మక్కల్‌ కచ్చి పార్టీలతో కలిసి బరిలో దిగుతున్నట్లు కమల్ వెల్లడించారు....

Published : 09 Mar 2021 12:58 IST

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ఇండియా జననాయక కచ్చి, ఆలిండియా సమతువా మక్కల్‌ కచ్చి పార్టీలతో కలిసి బరిలో దిగుతున్నట్లు కమల్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలకు చెరో 40 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అటు డీఎంకే వరుసగా తన కూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపుపై స్పష్టతనిస్తూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా తాజాగా సీపీఎంకు ఆరు సీట్లను కేటాయించింది. దీనితోపాటు మరో మూడు స్థానిక పార్టీలకు ఒక్కో స్థానాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు పార్టీలు డీఎంకే గుర్తుతోనే పోటీ చేస్తాయని పేర్కొంది. 

మరోవైపు టీటీవీ దినకరణ్‌కు చెందిన అమ్మా మక్కమ్‌ మున్నేట్ర కజగం పార్టీతో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఎంఐఎం పార్టీ తమిళనాడులో మూడు స్థానాల్లో పోటీకి దిగనుంది. వాణియంబాడి, శంకరాపురం, కృష్ణగిరిలో ఎంఐఎం బరిలో నిలువనున్నట్లు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్‌ అహ్మద్‌ ప్రకటించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని