MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Updated : 18 Nov 2023 15:01 IST

జగిత్యాల: ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది. భారాస అభ్యర్థి సంజయ్ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఎండ వేడికి తాళలేక ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని