Andhra News: 175 సీట్లు రావాలంటే వైకాపాలో ప్రక్షాళన జరగాలి: ఎంపీ రఘురామకృష్ణరాజు

రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎన్నో ఘోరాలు

Published : 03 May 2022 16:50 IST

దిల్లీ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 3 హత్యలు.. 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారని రఘురామ విమర్శించారు.

‘‘ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదికలో వెల్లడైంది. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉంటే.. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో 2వ స్థానంలో ఉంది. మహిళలపై భౌతికదాడుల విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 2019తో పోల్చితే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతంగా నమోదైంది. ప్రతి 3 గంటలకు ఒక ఎస్సీపై దాడులు జరుగుతున్నాయి. 2021లో అత్యధిక లాకప్‌ డెత్‌లు ఏపీలోనే జరిగాయని.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. మద్య నిషేధంలో భాగంగా మా ప్రభుత్వం పర్మిట్‌ రూమ్‌లు తీసేసింది. 2, 3 రోజుల్లోగా చెదురుమదురుగా జీతాలు పడొచ్చని ఆర్థిక శాఖ అంటోందని జోక్ వచ్చింది. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినా రాష్ట్రం అప్పులు తీరవు. 175 సీట్లు వస్తాయని అంటున్నారు.. చివర ఉన్న 5 తీసేస్తే మనకు చాలా కష్టం. 175 సీట్లు రావాలంటే ప్రక్షాళన జరగాలి’’ అని రఘరామ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు