Nara Lokesh: అవన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి: నారా లోకేశ్

శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రిలో ఆటో ప్రమాద ఘటనకు ఉడుత కారణమంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ప్రకటించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated : 30 Jun 2022 12:53 IST

అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రిలో ఆటో ప్రమాద ఘటనకు ఉడుత కారణమంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ప్రకటించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్రంగా తప్పుబట్టారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని విమర్శించారు. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేకపోయారా అని ఎద్దేవా చేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథలు చెప్పించడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని లోకేశ్‌ దుయ్యబట్టారు.

రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి..

 బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాడిమర్రిలో రైతులు, మృతుల కుటుంబాలతో కలిసి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. తాడిమర్రి విద్యుత్ ఉపకేంద్రం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని