AP News: మద్య నిషేధం అన్నారు.. దానిపైనే రూ.లక్ష కోట్లు సంపాదించారు: బొండా ఉమా

మద్య నిషేధం అన్నారు.. అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు.

Updated : 11 Apr 2024 15:29 IST

అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్‌ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో భాజపా నేత లంకా దినకర్‌, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలైపోయారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామన్నారు. తప్పులు చేసిన అధికారులు కోర్టుల్లో నిలబడక తప్పదని హెచ్చరించారు.   

మద్యంపై జగన్‌కు ఆదాయం కిక్కు.. పేదల ప్రాణాలకు ముప్పు ఉందని భాజపా నేత లంకా దినకర్‌ అన్నారు. మద్యంలో రూ.లక్షల కోట్లు దోచేసి సూట్‌కేసు కంపెనీలకు తరలించారని ఆరోపించారు. మద్యం, గంజాయి రెండూ ఆయనకు ఆదాయ వనరులని విమర్శించారు. మేనిఫెస్టోను జగన్ తుంగలో తొక్కారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేసి చూపిస్తుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని