Elections: ఇది అల మాత్రమే.. నిజమైన సునామీ ముందుంది: సువేందు

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా విజయం దిశగా దూసుకెళ్లడంపై భాజపా నేత సువేందు అధికారి స్పందించారు.

Published : 03 Dec 2023 16:01 IST

కోల్‌కతా: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల Assembly Election Results సరళిపై బెంగాల్‌ భాజపా నేత సువేందు అధికారి స్పందించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం దిశగా భాజపా దూసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా సాధించిన ఫలితాల ప్రభావం పశ్చిమబెంగాల్‌పైనా ఉంటుందన్నారు.  వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సునామీ కోసం బెంగాల్‌ ఎదురుచూస్తోందన్నారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లోని బెంగాలీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భాజపా గొప్ప ఫలితాలు సాధించడంలో బెంగాలీలు నిర్ణయాత్మక పాత్ర పోషించారన్నారు. అందుకు కృతజ్ఞత తెలుపుతూ అక్కడి భాజపా నేతలు తనకు ఫోన్‌ చేసినట్లు వెల్లడించారు. 

ఇది కేవలం అల (వేవ్‌) మాత్రమేనని.. నిజమైన సునామీ రాబోతోందని సువేందు అధికారి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సునామీని చూస్తామన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు బెంగాల్‌, ఒడిశా ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.  బెంగాల్‌లో అవినీతి, కుటుంబ తరహా పాలనను తుదముట్టించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని