Politics: కాంగ్రెసేతర విపక్షాలతో పవార్‌ రేపు భేటీ! 

ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌  కాంగ్రెసేతర విపక్ష పార్టీల నేతలతో మంగళవారం సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే...

Published : 21 Jun 2021 17:26 IST

దిల్లీ: ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌  కాంగ్రెసేతర విపక్ష పార్టీల నేతలతో మంగళవారం సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ నేపథ్యంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరోవైపు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పవార్‌తో సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మిషన్‌ 2024 లక్ష్యంగానే మంతనాలు జరిగి ఉంటాయని ఊహాగానాలు వినబడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న ముంబయిలో శరద్‌ పవార్‌ నివాసంలో భేటీ అయిన ఇరువురూ తాజాగా దిల్లీలో సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని