BSP: ఊహాగానాలు వద్దు.. మాయావతి ట్వీట్‌పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వివరణ

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి చేసిన ట్వీట్‌ను అర్థం చేసుకోకుండా చాలామంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 19 Mar 2024 13:22 IST

హైదరాబాద్‌: బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి చేసిన ట్వీట్‌ను అర్థం చేసుకోకుండా చాలామంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘గతంలో మా పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఏ జాతీయ పార్టీలతో గానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో గానీ పొత్తు పెట్టుకోబోమని చాలా స్పష్టంగా చెప్పారు. శనివారం కూడా ‘తృతీయ ఫ్రంట్’ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద అలాంటిదేం లేదని వివరణ ఇచ్చారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.

అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదు. గతంలో మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్లుగానే.. తెలంగాణలో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల సంబంధించి ఇటీవల బీఎస్పీ, భారాసతో పొత్తు కోసం జరిగిన చర్చలకు అధిష్ఠానం అనుమతి ఉంది. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని