TDP: రామప్రసాద్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి: సీఈవోకు తెదేపా లేఖ

మంగళగిరి తహసీల్దార్‌ రామప్రసాద్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయంలో పనిచేసేందుకు నియమించడంపై శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా నేత షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 09 Feb 2024 22:36 IST

గుంటూరు: మంగళగిరి తహసీల్దార్‌ రామప్రసాద్‌ను డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయంలో నియమించడంపై శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా నేత షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వివిధ అంశాలపై ఫిర్యాదు చేస్తూ సీఈవోకు లేఖ రాశారు. రామప్రసాద్ 2019లో ఎన్నికల విధుల్లో ఉన్నారని.. ఆ సమయంలో వైకాపాకు అనుకూలంగా పనిచేసినట్లు పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలిపై మంగళగిరి తెదేపా నాయకులు, కార్యకర్తలు గతంలో అభ్యంతరాలు తెలిపారన్నారు. సీఆర్డీఏ పరిధిలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంలో తహసీల్దార్‌ కీలకంగా వ్యవహరించారన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని సీఈవో కార్యాలయంలో నియమించడం సరి కాదన్నారు. రామప్రసాద్‌ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని