Andhra News: నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు: ధూళిపాళ్ల నరేంద్ర

నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Updated : 18 Apr 2022 15:38 IST

గుంటూరు: నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వక చోరీ అని ధూళిపాళ్ల ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చోరీలో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం ఉందా? ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే చోరీ జరిగిందా? కాకాణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకమా? ఏడు కేసుల్లో కాకాణి ముద్దాయిగా ఉన్నారు. సోమిరెడ్డి ప్రతిష్ఠ దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఏ1గా ఉన్నారు.

మంగళగిరిలోని విల్లాలో మహమ్మద్‌ అనే వ్యక్తి చనిపోయారు. ఏసీ మెకానిక్‌ మహమ్మద్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయి. మహమ్మద్‌ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి? సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలి. పోలీసులు దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదు’’ అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని