TS News: బండి సంజయ్‌ ‘నిరుద్యోగ దీక్ష’ ప్రారంభం

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో భాజపా నిరుద్యోగ దీక్ష చేపట్టింది.

Updated : 27 Dec 2021 11:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో భాజపా నిరుద్యోగ దీక్ష చేపట్టింది. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే దీక్షను భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ ప్రారంభించారు. బండి సంజయ్‌తో పాటు దీక్షలో పదాధికారులు, విజయశాంతి, ఈటల రాజేందర్‌, స్వామిగౌడ్‌, ఇతర నేతలు కూర్చున్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయించినా.. పోలీసుల అనుమతి నిరాకరణతో వేదికను భాజపా రాష్ట్ర కార్యాలయానికి మార్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని