
TS News: తెరాస అభ్యర్థి గెల్లుకు స్వగ్రామం, అత్తగారి ఊరిలో ఝలక్
హుజూరాబాద్: హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉప పోరులో ఉత్కంఠ ఫలితాలు వచ్చాయి. ఎనిమిదో రౌండ్ వరకు దూకుడు మీదున్న భాజపా అభ్యర్థి ఈటలకు బ్రేకులు వేసిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందుకు దూసుకొచ్చారు. ఆ వెంటనే మరో రౌండ్‌లో అంతే వేగంగా వెనుదిరిగారు. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో ఓటర్లు ఆయనకు షాకిచ్చారు. ఇక్కడ గెల్లు శ్రీనుకి 358 రాగా, ఈటల రాజేందర్‌కి 549 ఓట్లు పోలయ్యాయి. గెల్లు అత్తగారి గ్రామం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లెలోని ఓటర్లు కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ ఈటలకే 76 ఓట్ల అధిక్యం వచ్చింది. యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న వెంకటరావుపల్లెతో పాటు సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో కూడా ఓటర్లు తెరాసను ఆదరించలేదు. తెరాస ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ స్వగ్రామమైన సింగాపూర్‌లో కూడా ఇదే పరిస్థితి గులాబీ పార్టీకి ఎదురైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.