Ap News: జగన్‌ను నమ్మితే జైలుకు వెళ్లక తప్పదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు పాడై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలో నిర్వహించిన

Published : 06 Jan 2022 01:29 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు పాడై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలో నిర్వహించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని.. పిల్లలకు నాసిరకం భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రుల వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు డోలీల్లో రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అన్ని వ్యవస్థలను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘బలం లేదని మండలి రద్దు అన్నారు.. బలం వచ్చాక కావాలని అంటున్నారు. పోలీసులను చూపించి బెదిరిస్తున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్ట వ్యతిరేకంగా పనిచేసిన పోలీసులపై చర్యలు తప్పవు. సీఎం జగన్‌ను నమ్మితే జైలుకు వెళ్లక తప్పదని పోలీసులను హెచ్చరిస్తున్నా. ఈ ప్రభుత్వం మీడియాపైనా అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇక నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగతున్నాయి. ప్రజలకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. మద్యం వినియోగం పెంచుతూనే మద్య నిషేధం అంటారా.. మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడైనా ఇళ్లు కట్టారా?ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్‌ అంటారా..

బీసీల అభ్యున్నతే తెదేపా లక్ష్యం. మైనార్టీల మీద కూడా దాడులు చేస్తారా?ప్రశ్నిస్తే కేసులు పెడతారా?వాటికి భయపడి మేం పారిపోవాలా..?తెదేపాను లేకుండా చేయడం వైకాపా వల్ల కాదు. ఆనాడు హైదరాబాద్‌లో ఓఆర్ఆర్‌ను కూడా గ్రాఫిక్స్‌ అన్నారు. ఆనాటి గ్రాఫిక్సే.. ఇప్పటి 8 లైన్ల ఓఆర్‌ఆర్‌ రహదారి. సీఎం జగన్‌కు సంపద సృష్టించే ఆలోచన లేదు. అందుకే రూ.2 లక్షల కోట్ల ఆస్తి అయిన అమరావతిని నాశనం చేశారు. 5 కోట్ల ప్రజల కోసం మేం చేసేది ధర్మపోరాటం. రాష్ట్రంలోని వైకాపా వైరస్‌కు తెలుగుదేశం పార్టీయే వ్యాక్సిన్’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని