CM KCR: ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్‌

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి

Published : 03 Sep 2021 17:21 IST

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను  కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. గతేడాది డిసెంబరులో ప్రధానితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. అకాల వర్షాల వల్ల హైదరాబాద్‌లో దెబ్బతిన్న రహదారులు, మౌలికవసతుల కల్పనకు అవసరమై ఆర్థిక సాయం అందించాలని అప్పట్లో సీఎం కేసీఆర్ కోరారు. ఆ తర్వాత ప్రధానితో కేసీఆర్‌ ఇప్పటి వరకు భేటీ కాలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని