Ap News: ప్రధానిని కలిసేందుకు జగన్‌, విజయసాయి ఎందుకు భయపడుతున్నారు?: దేవినేని

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉగ్రవాదులు అంటున్నారని.. మరి తెదేపా పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వాళ్లు అహింసావాదులా? అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ....

Updated : 27 Oct 2021 18:40 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉగ్రవాదులు అంటున్నారని.. మరి తెదేపా పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వాళ్లు అహింసావాదులా? అని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ ఆధారాలున్నాయని ఉగ్రవాదులంటున్నారని దేవినేని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఎవరికి నోటీసులు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 28 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధ్యమన్నారని.. మరి ఇంతవరకు ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. 28 మంది ఎంపీలు ఉన్నా ప్రధాని మోదీని ఎందుకు కలవలేకపోయారని.. ప్రధానిని కలిసేందుకు సీఎం జగన్‌, విజయసాయి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయిరెడ్డి వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా? చంద్రబాబు పోరాడుతుంటే విజయసాయిరెడ్డికి దిల్లీలో వణుకొస్తోందని దేవినేని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని