RS Praveen kumar: ఎవరికి గుణపాఠం చెప్పేందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారు

తెలంగాణలో బహుజన స్థాపన వస్తే ఎవరూ ఆపలేరని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బహుజనులు ఎక్కడ..

Published : 31 Jul 2021 17:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బహుజన స్థాపన వస్తే ఎవరూ ఆపలేరని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బహుజనులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలనేది పాలకుల అలోచన అని అన్నారు. హుజూరాబాద్‌లో మాత్రమే దళిత బంధు ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు. ఎలాంటి పరిశోధన చేయకుండానే.. ఎవరికో గుణపాఠం చెప్పేందుకు రూ.వెయ్యి కోట్లు పెడుతున్నారని విమర్శించారు. రూ.వెయ్యి కోట్లతో పేద విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ఫోన్లు కొనిపెట్టడమే కాకుండా అద్భుతమైన హాస్టళ్లను నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. 20 వేల డిజిటల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయొచ్చన్నారు. తనను కలిసిన బహుజన ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని.. మరి గుండెల్లో పెట్టుకున్న లక్షల మందిని ఏం చేస్తారని నిలదీశారు. ఒక ఆలోచనకు సన్నద్ధమైతే ప్రపంచంలో ఏ శక్తీ ఎవరినీ ఆపలేదన్నారు. నేటి తరాన్ని అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. ఇందుకు ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా అన్యాయాన్ని నిలదీయాలన్నారు. నేటి తరమే రాబోయే రాజ్యానికి వారసులు, చుక్కాని, ఇంధనం అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని