Akhilesh Yadav: యోగికి తెలుసు..అందుకే గంగానదిలో స్నానమాచరించలేదు

ప్రధాని మోదీ వారణాసి పర్యటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రం, యూపీలోని భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. కోట్లు ఖర్చుపెడుతున్నా..విషతుల్యంగా మారిన గంగానది ఎప్పటికి శుభ్రమవుతుందోనని మండిపడున్నాయి. ఇదే విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. 

Updated : 15 Dec 2021 11:03 IST

భాజపాపై అఖిలేశ్ విమర్శలు

లఖ్‌నవూ: ప్రధాని మోదీ వారణాసి పర్యటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రం, యూపీలోని భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. కోట్లు ఖర్చుపెడుతున్నా..విషతుల్యంగా మారిన గంగానది ఎప్పటికి శుభ్రమవుతుందోనని మండిపడున్నాయి. ఇదే విషయమై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. 

‘గంగానదిని స్వచ్ఛంగా మార్చేందుకు భాజపా కోట్లు ఖర్చుపెడుతోంది. గంగానది కాలుష్య కాసారంలా ఉందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలుసు. అందుకే ఆయన నదిలో స్నానమాచరించలేదు. అసలు నా ప్రశ్న ఏంటంటే.. గంగమ్మ తల్లి ఎప్పటికైనా శుభ్రమవుతుందా..? నిధులు ప్రవహిస్తున్నాయి కానీ, గంగా నది మాత్రం శుభ్రం కాలేదు’ అని అఖిలేశ్ విమర్శించారు. 

సోమవారం వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయ నడవాను ప్రారంభించిన మోదీ.. ఈ రోజు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. నిన్న విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ముందు ప్రధాని కాషాయ వస్త్రాల్లో గంగా నది స్నానమాచరించారు. అక్కడ యోగి కనిపించలేదు. దానిని ఉద్దేశించి అఖిలేశ్‌ విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి గద్దెనెక్కాలని భాజపా ప్రయత్నిస్తుండగా.. సమాజ్‌వాదీ పార్టీ కూడా అధికారం హస్తగతం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని