ఆ అంశాలు.. కేరళ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు కేరళలోని విజయన్‌ సర్కారును కుదిపేస్తున్నాయి. బ్యాక్‌ డోర్‌ నియామకాల పేరిట ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఇటీవల పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేసిన నిరసనలు....

Published : 13 Feb 2021 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు కేరళలోని పినరయి విజయన్‌ సర్కారును కుదిపేస్తున్నాయి. బ్యాక్‌ డోర్‌ నియామకాల పేరిట ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఇటీవల పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అజెండాగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ భావిస్తోంది. తమ యువజన విభాగాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కాగా వీటిని సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ఎలా తిప్పికొడుతుంది? ప్రజల మెప్పుపొంది వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా?అనేది ఆసక్తికరంగా మారింది.

అధికారపక్షంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, బ్యాక్‌డోర్‌ నియామకాల ఆరోపణలు ఎల్‌డీఎఫ్‌పై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వీటికి తోడు తాజాగా పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ర్యాంకు లిస్టు చెల్లుబాటును పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్న వారు.. తమను కాదని ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటోందని ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు పొడిగించినా అభ్యర్థులు నిరసనలు విరమించలేదు. వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. ప్రభుత్వంలో ఎంతోకాలం పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను మానవతా ప్రాతిపదికన క్రమబద్దీకరిస్తున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుత పీఎస్సీ ర్యాంకర్ల అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అయినా తాత్కాలిక నియామకాలపై నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి...

తమిళనాట శశి‘కలవరం’!

వ్యక్తిని కాదు.. పదవిని అవమానించారు!

పూర్తి సమాచారం కోసం కింది వీడియోను చూడండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని