Raghurama: నన్ను మరోసారి అరెస్టు చేసేందుకు మఫ్టీలో పోలీసులు: రఘురామ

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై సీఎం జగన్‌ నిఘా పెట్టించారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.

Updated : 28 Feb 2022 05:56 IST

దిల్లీ: వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై సీఎం జగన్‌ నిఘా పెట్టించారని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. మరోసారి తనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘భీమ్లా నాయక్‌’ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతి వారిని అధికార బలంతో దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన తగిన సమయంలో గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని