YSRCP: ఏపీ రాజధానిపై వైకాపా కొత్త పల్లవి

ఏపీకి రాజధాని విషయంలో వైకాపా కొత్త పల్లవి అందుకుంది. 

Updated : 13 Feb 2024 21:47 IST

విశాఖపట్నం: ఏపీకి రాజధాని విషయంలో వైకాపా కొత్త పల్లవి అందుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామంటోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై కేంద్రంతో చర్చిస్తామని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

‘‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పెట్టారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేక.. తాత్కాలిక నిర్మాణాలే  చేపట్టింది. మా ప్రభుత్వం వచ్చాక.. ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసే స్థోమత లేదని చిత్తశుద్ధితో చెప్పి.. అన్ని వనరులు ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని చూశాం. కానీ, న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. వాటిని అధిగమించే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది మా ఆలోచన’’ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని